![]() |
![]() |

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -336 లో... కృష్ణ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటే.. తన చిన్నమ్మ కాఫీ తీసుకొని వస్తుంది. ఏంటి అల్లుడి గురించేనా లేక మీ పెద్దత్తయ్య గురించి బాధపడుతున్నావా అని అడుగుతుంది. అదేం లేదని కృష్ణ అంటుంది. నీ జిందగీని ఇలా బర్ బాత్ చేస్తుంటే చూడాలా? మీ నాన్నని అనాలి. పెద్ద చదువులు వద్దని చెప్పినా వినలేదని కృష్ణతో వాళ్ళ చిన్నమ్మ అంటుంది. అప్పుడే అక్కడికి రేవతి వస్తుంది. ఏంటి వదిన నా కోడలి మీద కేకలు వేస్తున్నావ్? దీనికి నేనున్నానని రేవతి అనగా.. ఉండి ఏం చేస్తాం వదిన కబుర్లు చెప్పడం తప్ప అని అంటుంది. కృష్ణ మీ చిన్నమ్మ అన్న దాంట్లో తప్పేం ఉంది. నిజాలే కదా మాట్లాడేదని రేవతి అంటుంది. నాకైతే మంచిగా అనిపిస్తలేదని కృష్ణ చిన్నమ్మ అనగా.. నాకు మాత్రం మంచిగా అనిపిస్తుందా? అన్నయ్య అలా జైలుకి వెళ్ళడంతో భవాని అక్క అదే నమ్మి, ఇదిగో ఇలా పెళ్ళి దాకా తీసుకొచ్చిందని రేవతి అంటుంది.
మీ పెద్దత్తయ్య చెప్పిన విషయం చెప్తే నువ్వు బాధపడ్తావని అనుకుంటున్నా అని రేవతి అనగా.. నన్ను టెన్షన్ పెట్టకుండా నిజం చెప్పండని కృష్ణ అడుగగా.. నువ్వు దీపాలు పెట్టడానికి వెళ్ళావ్ కదా.. అప్పుడు దీపాలు ఎందుకు పెడతారని మురారి భవాని అక్కని అడిగాడు. పెళ్ళైన వాళ్ళు తమ భర్తలు బాగుండాలని చేస్తారు అందుకే కృష్ణ వెళ్ళిందని భవాని అక్క అనగానే.. మురారి నిలకడగా ఉండలేకపోతున్నాడని రేవతి అనుకుంటుంది. పెద్దత్తయ్య ఆ మాట చెప్పడం వల్ల మురారికి గతం గుర్తొచ్చే అవకాశం ఉంది. ఆ ఆలోచనలో ఏదో ఒకటి తప్పకుండా కనెక్ట్ అవుతుంది. రెండు మూడు రోజుల్లో గతం గుర్తుకొస్తుందని కృష్ణ అంటుంది. ఇక రేవతి హ్యాపీగా ఉంటుంది. మరోవైపు మురారి గదిలో తీవ్రంగా ఆలోచిస్తుంటాడు. ఇందాక వేణి గారి భర్త ఎవరని అడిగితే తెలుసన్నావ్ కదా అని మధుని మురారి అడుగుతాడు. అప్పుడే మధు వాళ్ళ నాన్న పిలుస్తాడు. కాసేపటికి మధు వాళ్ళ నాన్నతో ఫ్రస్టేషన్ గా తన బాధ చెప్పుకుంటాడు. ఏంటని మధు వాళ్ళ నాన్న ప్రసాద్ అడుగగా.. ఈ బానిసత్వమే వద్దు. నేను చెప్పేస్తానని మధు అంటాడు. ఇక అప్పుడే మధు వాళ్ళ అమ్మ సుమలత అక్కడికి వచ్చి.. చెంప పగులగొడతా, అయినా మీరేంటి సిగ్గులేకపోతే సరి.. కొడుకుతో తిట్లు తినడానికి సిగ్గులేకపోతే సరి. పదండి కిందకి భోజనం చేద్దాం పదండి అని మధు, ప్రసాద్ లకి సుమలత చెప్తుంది.
కాసేపటికి ఒక్క భవాని కాకుండా మురారి, ముకుంద, రేవతి, మధు, సుమలత, నందు, గౌతమ్ అందరు డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. ఇక మురారి తినకుండా ఆలోచిస్తుంటాడు. ప్లేట్ లో భోజనం పెట్టుకొని ఆలోచిస్తున్నావేంటని రేవతి అడుగగా.. నీ గురించే అని మురారి అంటాడు. ఏమైందని అని రేవతి అడుగగా.. నేనొకటి అడిగితే నిజం చెప్తావా? గతం మర్చిపోయిన వెర్రివెదవని కదా అని మురారి అనగా.. నేనేమైనా అడిగితే ఎవరు సమాధానం చెప్పట్లేదని మురారి అంటాడు. నిజంగా నిజమే చెప్తావా అని మురారి అంటాడు. వేణి గారి భర్త ఎవరు? అతని పేరేంటి? అని మురారి అడుగగానే రేవతి షాక్ అవుతుంది. అడిగేది నిన్నే అమ్మ.. దయచేసి తెలిసినా తెలియదని చెప్పకని మురారి అనేసి ప్లేట్ నేలకేసి కొట్టేస్తాడు. ఇక మధు రెచ్చిపోయి.. అసలు మా అందరిని అడగడం ఎందుకు బ్రో.. నీకు వేణి గారు తెలియదా ఏంటి? ఆవిడనే డైరెక్ట్ గా వెళ్ళి అడుగని అంటాడు. వెళ్తా వెళ్ళి డైరెక్ట్ తననే అడుగుతా అని మురారి వెళ్తుండగా.. మురారి ఒక్క నిమిషం.. వేణి భర్త గురించి నీకు ఎందుకు? వారి మధ్య ఏవో మనస్పర్ధలు ఉండుంటాయి. నువ్వు వెళ్ళి అడిగితే తను హర్ట్ అవ్వొచ్చని ముకుంద అంటుంది. మీరంతా అతని గురించి చెప్పడానికి అనుమానపడుతున్నారంటే నాకేదో అనుమానంగా ఉంది. నేను అడుగుతానని మురారి కృష్ణ దగ్గరికి వెళ్తాడు. తర్వాతి ఎపిసోడ్లో.. కొత్త విషయం ఏంటో చెప్పలేదని కృష్ణ అడుగగా.. మీరు ఇక్కడ ఒక్కరే ఉంటున్నారు. మీ వారెక్కడ ఉంటున్నారని మురారి అడుగగానే కృష్ణ షాక్ అవుతుంది. అది గుమ్మం దగ్గర నుండి ముకుంద చాటుగా వింటుంది. మరి వేణి భర్త మురారీనే అనే విషయాన్ని గతం మర్చిపోయిన మురారికి చెప్తుంది లేక ముకుంద ఆపుతుందా తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |